వ్రాయడం ఒక కళ, వ్రాయగలగడం ఒక వరం. ఈ కళను నా కలగా కాంటూవుంటాను, కావాలనుకుంటాను. ఈ కల, ఆ వరం కలయికే నా ఈ కల-వరం, కలవరం.

పుట్టిన దేశానికి వేల మైళ్ళ దూరంలో వుంటూ, అమ్మనీ ఆవకాయనీ మరవలేక, అమెరికాలో అలోచనలకు ప్రతిరూపమే నా ఈ మంచు పల్లకి. గీత లో చెప్పినట్టు “శ్రేయాన్  స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్ – స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః” చక్కగా అనుష్ఠింపబదిన ప్రధర్మము కన్నా, గుణములేనిదైననూ స్వధర్మమే మేలు.

స్వధర్మాన్ని పాటిస్తూ మీకందరికీ స్వయంగా స్వీయంగా విశేషాలని విషయాలనీ వివరించగలనని ఆశిస్తూ..

– మీ కలిసిపూడి కిషొర్

ప్రకటనలు